గోంగూర బిర్యానీ తయారీ విధానం...


Posted August 19, 2018 by Jinukala

గోంగూర అంటే తెలియని వారు ఉండరు. గోంగూర పచ్చడి అంటే ఇష్టపడని వారు ఉండరు. గోంగూరతోనే బిర్యానీ చేసుకుంటే ఇంకా బావుంటుంది.

 
మసాలాదినుసులు బాస్మతి బియ్యం వల్ల దీనికి మరింత రుచి, వాసన ఉంటుంది. ఘుమఘుమలాడే గోంగూర బిర్యానీ టేస్ట్ చూడాలంటే ఒకసారి ట్రై చేసి చూడాల్సిందే…
తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు..
బాస్మతి బియ్యం: ఒకటిన్నర కప్పు, గోంగూర: రెండు కప్పులు
అల్లం వెల్లుల్లి పేస్టు: ఒక టీస్పూను, ఉల్లిపాయ: ఒకటి
పచ్చిమిర్చి: ఆరు, కొత్తిమీర: కొంచెం, లవంగాలు: 4, దాల్చిన చెక్క: చిన్నముక్క
బిర్యాని ఆకు: 1, నెయ్యి: ఒక టేబుల్ స్పూను
నూనె: ఒక టేబుల్ స్పూను, ఉప్పు: తగినంత.
తయారు చేసే విధానం..
బాండీలో నూనె పోసి గోంగూరను మెత్తగా ఉడికించి రుబ్బి పక్కన బెట్టుకోవాలి.
కుక్కర్‌లో నెయ్యి పోసి వేడెక్కాక దాల్చిన చెక్క, బిర్యాని ఆకు, జీడిపప్పు, లవంగాలు వేసి వేగించాలి.
తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, కొంచెం ఉప్పు వేసి బాగా వేగించాలి. తర్వాత అల్లంవెల్లుల్లి పేస్టు వేసి వాసన వచ్చే వరకు వేయించాలి.
తర్వాత గోంగూర వేసి బాగా కలపాలి. చివరగా బాస్మతి బియ్యం వేసి తగినన్ని నీళ్లు పోయాలి. మూడు విజుల్స్ వచ్చాక దించితే సరి గోంగూర బిర్యానీ రెడీ. వేడివేడిగా తింటే ఆ టేస్టును మరిచిపోలేం.
-- END ---
Share Facebook Twitter
Print Friendly and PDF DisclaimerReport Abuse
Contact Email [email protected]
Issued By manatelangana news
Website http://manatelangana.news/gongura-biryani-recipe/
Country India
Categories Editorial
Last Updated August 19, 2018