ఆసియా క్రీడల్లో భారత్ బోణీ


Posted August 19, 2018 by Ramesh476

ఇండోనేషియా వేదికగా జరుగుతున్న 18వ ఆసియా క్రీడలు శనివారం అట్టహాసంగా ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ క్రీడల్లో భారత్ ఆదివారం పతకాల బోణీ చేసింది.

 
జకార్తా: ఇండోనేషియా వేదికగా జరుగుతున్న 18వ ఆసియా క్రీడలు శనివారం అట్టహాసంగా ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ క్రీడల్లో భారత్ ఆదివారం పతకాల బోణీ చేసింది. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్ డ్ విభాగంలో భారత్ కు చెందిన అపూర్వి చండేలా, రవికుమార్ జోడీ కాంస్యం సాధించింది. ఇక ఆసియాకు చెందిన 45 దేశాలు ఈ క్రీడల్లో పాల్గొంటున్నాయి. దాదాపు 10 వేల మంది క్రీడాకారులు వివిధ దేశాలకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. శనివారం జకార్తాలోని గెలొరా బంగ్ కర్నో స్టేడియంలో ప్రారంభ వేడుకలు కనుల పండవగా జరిగాయి. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు కనువిందు చేశాయి. ఫైర్ వర్క్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మిరుమిట్లు గొలిపే కాంతుల నడుమ ఆరంభ వేడుకలను ఘనంగా నిర్వహించారు.
-- END ---
Share Facebook Twitter
Print Friendly and PDF DisclaimerReport Abuse
Contact Email [email protected]
Issued By Mana Telangana
Website http://manatelangana.news
Country India
Categories Games , Sports
Tags Asian Games 2018 , Bronze , win , Apurvi Chandela , Ravi Kumar
Last Updated August 19, 2018