వైభవంగా ప్రియాంక, నిక్ ల నిశ్చితార్థం వేడుక...!


Posted August 18, 2018 by Ramesh476

ముంబయి: మాజీ మిస్ వరల్డ్, బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా, అమెరికన్ సింగర్ నిక్ జొనాస్ ల నిశ్చితార్థం శుక్రవారం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ ఎంగేజ్ మెంట్ కార్యక్రమం ఇవాళ ఉదయం ముంబయిలోని ప్రియాంక నివాసంలో నిర్వహించారు.

 
ముంబయి: మాజీ మిస్ వరల్డ్, బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా, అమెరికన్ సింగర్ నిక్ జొనాస్ ల నిశ్చితార్థం శుక్రవారం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ ఎంగేజ్ మెంట్ కార్యక్రమం ఇవాళ ఉదయం ముంబయిలోని ప్రియాంక నివాసంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రియాంక పసుపు రంగు దుస్తుల్లో మెరిసిపోయింది. అలాగే నిక్ తెలుపు రంగు కుర్తా పైజమా ధరించాడు. పూర్తిగా హిందూ సంప్రదాయంలో వీరి నిశ్చితార్థం జరగడం విశేషం. ప్రియాంక, నిక్ తల్లిదండ్రుల సమక్షంలో ఈ వేడుక జరిగింది. ప్రియాంక కజిన్, సినీ నటి పరిణీతి చోప్రాతో పాటు పలువురు నటీనటులు ఈ కార్యక్రమానికి హాజరైనట్లు సమాచారం. ఈ సాయంత్రం ముంబయిలోని ఓ స్టార్ హోటల్ లో ఈ జంట ఎంగేజ్ మెంట్ పార్టీ ఇస్తున్నారు. ఈ పార్టీకి రణవీర్ సింగ్, కరణ్ జొహార్ లతో పాటు పలువురు బాలీవుడ్ యాక్టర్స్ తో పాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు కూడా హాజరకానున్నారు.
-- END ---
Share Facebook Twitter
Print Friendly and PDF DisclaimerReport Abuse
Contact Email [email protected]
Issued By Mana Telangana
Country India
Categories Entertainment , Movies
Last Updated August 18, 2018