చేజర్ల ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఉచిత వ్యాధినిర్ధారణ వైద్య శిబిరం


Posted November 25, 2021 by ajanthapublicrelations

అ మాతృభూమిపై మమకారం అ ప్రవాసాంధ్ర దంపతుల సేవా దృక్పథం

 
చేజర్ల, నవంబరు 21: ప్రవాసభారతీయుడైన చుండి తిమ్మారెడ్డి, కీర్తి శేషులు శ్రీమతి చుండి సుశీలమ్మల జ్ఞాపకార్థం, అమెరికా కాలిఫోర్నియా రాష్ట్రం బార్‌స్ట్రో నగరంలో వుంటున్న చేజర్ల దంపతులు డాక్టర్‌ మోహన్‌ మల్లాం, డాక్టర్‌ పద్మ మల్తాంలు ఆదివారం నాడు స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఉచిత వ్యాధి నిర్ధారణ వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ప్రవాసభారతీయుల అమెరికా వైద్య సంఘం, గ్లోబల్‌ టెలిక్షినిక్స్‌ సంస్థలతో కలిసి వైద్య దంపతులు ఈ వ్యాధి నిర్ధారణ శిబిరాన్ని నిర్వహించారు.

ఆధునిక జీవనైలి, ఆహారపు అలవాట్లు, వాతావరణ పరిస్థితుల ప్రభావంతో ఇటీవలి కాలంలో గుండె, కిడ్పీ థైరాయిడ్‌, అధిక బరువు సమస్యలతో ప్రజలు బాధపడుతున్నారు. వీటిని దృష్టిలో పెట్టుకుని కొన్ని గ్రామాలను దత్తతగా తీసుకుని ఉచితంగా వ్యాధి నిర్దారణ శిబిరాలను నిర్వహించి ఆరోగ్య సంరక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

ఈ క్రమంలోనే ఆదివారం నాడు చేజర్ల ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఈ ఉచిత వ్యాధి నిర్ధారణ శిబిరం జరిగింది. ఈ శిబిరానికి వచ్చిన 150 మందికి హైదరాబాదు నుంచి వచ్చిన వైద్యబృందం రక్త పరీక్షలు, అధిక బరువు పరీక్షలను నిర్వహించడం జరిగింది.

పరీక్షా ఫలితాలు వచ్చిన తరువాత త్వరలోనే ప్రతి ఒక్కరికి వారి వారి అనారోగ్య సమస్యల వివరాలను అందించి, తగిన వైద్య సూచనలను అందించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని చేజర్లకు చెందిన రామ్మోహన్‌గారు, వీర రాఘవరెడ్డిగార్లు పర్యవేక్షించారు.
-- END ---
Share Facebook Twitter
Print Friendly and PDF DisclaimerReport Abuse
Contact Email [email protected]
Issued By Ajantha Public Relations
Phone 9391784714
Business Address Sri Manjula Nilayam, Flat No 502, Plot No 339, Sri Sai Nagar Madhapur, Hyderabad, Telangana 500081
Country India
Categories Medical
Tags chejerla , chejerla medical camp , free medical camp chejerla , free medical camp nellore , free medical camp news , medical camp in nellore , nellore news
Last Updated November 25, 2021